సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి.. జవాన్‌కు గాయాలు
సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి.. జవాన్‌కు గాయాలు | జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని జైన్పోరాలోని క్రాల్చక్ ప్రాంతంలో మంగళవారం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని జైన్పోరాలోని క్రాల్చక్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది. కాల్పుల్లో జవాన్ అజయ్ కుమార్ చేతికి బుల్లెట్ గాయమైందని, చికిత్స అనంతరం కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపాయి.
అనంతరం ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా స్థలంలో జవాన్లకు తూటాలు లభ్యమయ్యాయి. కాగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాశ్మీర్లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని, హజ్రత్బల్ దేవాలయాన్ని సందర్శించనున్నారు. శ్రీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం అనంత్‌నగర్ జిల్లాలో బీజేపీ సర్పంచ్‌తో పాటు అతని భార్యపై కాల్పులు జరుపడంతో ఇద్దరూ మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..
Extended Ban : భారత విమానాలపై మరోసారి నిషేధం పొడగించిన కెనడా
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్
TTD : తిరుమలలో ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహనంపై శ్రీవారి విహారం
Sliver Coins : ఇసుకలో వెండి నాణేలు.. పోటీపడి ఏరుకుంటున్న జనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

