మానవత్వాన్ని కాపాడి మంచిని పెంచేందుకే ఆలయ నిర్మాణాలు..
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

రుద్రూర్: మానవత్వాన్ని కాపాడి మనిషిలో మంచిని పెంచేందుకే ఆలయ నిర్మాణాలు చేపడుతారని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మిపూర్ క్యాంపులో రూ. 25లక్షలతో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. చేసే పనికి దైవ సంకల్పం తోడయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తు దైవ చింతన పెరుగుదలకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి చూస్తుంటే ముచ్చటేస్తుందని , ఆలయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పని పూర్తి చేసేదాక నిద్రపోరని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేనన్నీ డబుల్‌బెడ్ రూం ఇండ్లను బాన్స్వాడ నియోజక వర్గంలో నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాంనారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ అక్కపల్లి సుజాతనాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ నారోజి గంగారాం, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

