వర్క్ గ్రూప్స్‌లో, ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ చాట్స్‌లో మనం రోజూ వందల మెసేజెస్ పంపుతున్నాం. కానీ ‘నేను రాసిన మెసేజ్ క్లియర్‌గా ఉందా? గ్రామర్ సరిగ్గా ఉందా? లేదా మరింత ప్రొఫెషనల్‌గా మెసేజ్ రాయొచ్చా?’ అని ఎప్పుడైనా ఆలోచించామా! ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం వచ్చేసింది. టెలిగ్రామ్ తన అప్డేట్లో ఏఐ-పవర్డ్ టెక్ట్స్ ఎడిటర్ని తీసుకొచ్చింది! పోల్స్ ఫీచర్‌ని కూడా స్మార్ట్ అప్‌గ్రేడ్ చేసింది. లైవ్ ఫొటోస్ సపోర్ట్, డాక్యుమెంట్ స్కానర్.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్స్ యాడ్ చేసింది. ఇది కేవలం అప్డేట్ కాదు.. మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మార్చేసే గేమ్‌చేంజర్!
టెలిగ్రామ్ కొత్త అప్డేట్లో వచ్చిన ఏఐ టెక్ట్స్ ఎడిటర్ కేవలం సాధారణ గ్రామర్ చెక్ టూల్ కాదు.. ఇది మీ మెసేజెస్‌ని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేయగల స్మార్ట్ అసిస్టెంట్! మీరు పొడవైన మెసేజ్ టైప్ చేసినప్పుడు.. ఈ ఏఐ ఎడిటర్ ఆప్షన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. దీని ద్వారా మీరు గ్రామర్ని సరిదిద్దుకోవచ్చు. మీ టెక్ట్స్‌ని వేర్వేరు స్టయిల్స్‌లో రీరైట్ చేయించుకోవచ్చు. వేర్వేరు భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలు కూడా ఉంది. ఫార్మల్ టోన్, షార్ట్ ఫార్మాట్, క్యాజువల్ స్టయిల్ ఇలా ఏ టోన్‌లో కావాలంటే అలా రాసేయొచ్చు. ఉదాహరణకు, మీరు ఒక వర్క్ మెయిల్ రాయాలనుకుంటే.. ఫార్మల్ టోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తుంటే.. క్యాజువల్ స్టయిల్ ఎంచుకోవచ్చు!
‘ఏఐ టూల్ వాడితే మన డేటా ప్రైవసీ ఏంటి? మన మెసేజెస్‌ని ఏఐ చదువుతుందా?’ అని చాలామందికి డౌట్! ఈ ప్రశ్నకు టెలిగ్రామ్ చాలా క్లియర్‌గా జవాబు ఇచ్చింది. ‘ఈ ఏఐ ఎడిటర్ టెలిగ్రామ్ Cocoon AI సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇది పూర్తిగా ప్రైవసీ-సెంట్రిక్‌గా డిజైన్ చేసింది. మీ మెసేజెస్‌ని ప్రాసెస్ చేసినా.. డేటాని యాక్సెస్ చేయదు, స్టోర్ చేయదు, షేర్ చేయదు!’ అని అభయమిచ్చింది. మెసేజ్ టైప్ చేసి.. సెండ్ చేయడానికి ముందు మాత్రమే ఈ ఏఐ టూల్ వాడొచ్చు. సెండ్ చేశాక ఎడిట్ చేసే వీలుండదు.
టెలిగ్రామ్ పోల్స్ ఫీచర్ కూడా ఈ అప్డేట్లో చెప్పుకోదగిన మార్పు. ఇకపై మీరు పోల్స్‌లో కేవలం టెక్ట్స్ ఆప్షన్స్ మాత్రమే కాదు.. మీడియా లేదా లొకేషన్స్‌ని కూడా జోడించవచ్చు! ఉదాహరణకు, ‘ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం?’ అని పోల్ పెట్టినప్పుడు.. ప్రతి ఆప్షన్‌కి సంబంధించిన ఫొటో లేదా లొకేషన్ మాప్ యాడ్ చేయవచ్చు! అంతేకాదు పోల్‌లో పార్టిసిపెంట్స్‌కి కొత్త ఆప్షన్స్ సజెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వొచ్చు. అంటే, మీరు కొన్ని ఆప్షన్స్ ఇస్తే.. వోటర్స్ కూడా తమ ఆలోచనలు యాడ్ చేయవచ్చు అన్నమాట. రీవోట్స్ని డిసేబుల్ చేయడం, టైమ్ లిమిట్స్ సెట్ చేయడం, ఓటింగ్ ముగిసే వరకు రిజల్ట్స్‌ని హైడ్ చేసే ఆప్షన్లూ ఉన్నాయి!
ఫొటో షేరింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ అప్డేట్తో మరింత ఇంట్రెస్టింగ్ అయ్యింది! iOS యూజర్స్‌కి లైవ్ ఫొటోస్ సపోర్ట్ వచ్చింది. అంటే, మీరు తీసిన ఫొటోలో కొన్ని సెకన్ల మోషన్ కూడా ఉంటుంది! Android యూజర్స్‌కి ఈ ఫీచర్ సపోర్ట్ ఉంది. ఈ ఫొటోస్‌ని పంపినప్పుడు.. లూప్ ప్లేబ్యాక్ లేదా బౌన్స్ ప్లేబ్యాక్ ఆప్షన్స్ ఉంటాయి! అంటే, ఫొటో కేవలం స్టిల్ ఇమేజ్ కాదు.. ఒక చిన్న వీడియోలా రన్ అవుతుంది! ఇది మీ మెసేజెస్‌కి మరింత లైఫ్, ఎమోషన్ని యాడ్ చేస్తుందన్నమాట!
iOS యూజర్స్‌కి ఈ అప్డేట్లో ఒక ప్రత్యేక ఫీచర్ వచ్చింది.. అదే డాక్యుమెంట్ స్కానర్! మీరు మీ ఫోన్ కెమెరాతో ఏదైనా డాక్యుమెంట్ ఫొటో తీస్తే.. అది ఆటోమేటిక్‌గా PDFగా కన్వర్ట్ అవుతుంది! ఆటోమేటిక్ క్రాపింగ్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ కూడా చేయొచ్చు. మీరు కావాలనుకుంటే మ్యానువల్ అడ్జెస్ట్మెంట్స్ కూడా చేయవచ్చు. రొటేట్ చేయడం, ఫిల్టర్స్ అప్లయ్ చేయడం ఇవన్నీ సాధ్యమే! ఇది స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్‌కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది!