హైదరాబాద్, ఆట ప్రతినిధి : గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ పోటీలో రాష్ట్ర యువ స్విమ్మర్ మైలారి సుహాస్ ప్రీతమ్ 27:68సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నాడు.
ఇదే విభాగంలో అర్జున్‌సింగ్(హర్యానా), వేదాంత్చంద్ర(ఉత్తర్‌ప్రదేశ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లె ఈవెంట్లో శ్రీనిత్య సాగి 5:20:81సెకన్ల టైమింగ్‌తో కాంస్యం దక్కించుకుంది. మరోవైపు 200మీటర్ల సైక్లింగ్ స్ప్రింట్ ఈవెంట్లో తనీశ్కుమార్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.