వర్సిటీ రిక్రూట్మెంట్కు కొత్త రోస్టర్
ఏడు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక రోస్టర్ విధానం పూర్తిగా మారనున్నది. ఈసారి నుంచి కొత్త రోస్టర్ అమలు కానున్నది.
- ఆర్డినెన్స్ జారీచేయనున్న సర్కార్
- ఆ తర్వాతే నోటిఫికేషన్లు జారీ
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఏడు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక రోస్టర్ విధానం పూర్తిగా మారనున్నది. ఈసారి నుంచి కొత్త రోస్టర్ అమలు కానున్నది. పాత రోస్టర్‌కు స్వస్తి పలకనున్నారు. రోస్టర్ విధానంలోనూ కీలక మార్పు చోటుచేసుకోనున్నది. ఇది వరకు డిపార్ట్మెంట్(విభాగం) యూనిట్‌గా రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోగా, దీన్ని ఉపసంహరించనున్నారు. దీని స్థానంలో కొత్తగా యూనివర్సిటీ యూనిట్‌గా రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇక నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కొత్త రోస్టర్ విధానం అమల్లోకి రానున్నది. ఇప్పటి వరకు ఆర్ట్స్ సోషల్ సైన్సెస్, కామర్స్ పోస్టులు ఒక గ్రూపుగా, సైన్స్ సబ్జెక్టు పోస్టులకు ఒక గ్రూపుగా, ఇంజినీరింగ్ పోస్టులకు ఒక గ్రూపుగా విభజించి రోస్టర్ పాయింట్లను నిర్ణయించి అమలు చేస్తున్నారు. ఇటీవల యూనివర్సిటీ రిక్రూట్మెంట్ విధానంలో కీలక మార్పు చోటు చేసుకున్నది. యూనివర్సిటీ యూనిట్‌గా రోస్టర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టులు తీర్పు ఇచ్చాయి. ఇది వరకు సబ్జెక్టువారీగా రోస్టర్‌ను అనుసరిస్తుండగా.. దీనికి ముగింపు పలకాల్సి ఉంది. చట్ట సవరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీచేయాల్సి ఉంది. త్వరలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసే అవకాశమున్నది. బ్యాక్లాగ్ పోస్టులకు మాత్రం పాత రోస్టరే అమల్లో ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

