చదువులకు కరువు సెగ
రాష్ట్రంలో కరువు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల సెగ చదువులకు తగిలే ప్రమాదం ఉన్నది. ఈ సమస్యల వల్ల ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత అధికమైంది. విద్యుత్తు కోతలు సర్వసాధారణమయ్యాయి.
- ఏప్రిల్, మే నెలల్లో మరింత దుర్భిక్షం
- విద్యారంగంపై కరువు ప్రభావం
- అధిగమించడంపై దృష్టిపెట్టని సర్కార్
- కానరాని ముందస్తు కార్యాచరణ
- పరీక్షల నిర్వహణ పెను సవాలే
- ఆన్లైన్ పరీక్షలకు విద్యుత్తు కోతల గండం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల సెగ చదువులకు తగిలే ప్రమాదం ఉన్నది. ఈ సమస్యల వల్ల ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత అధికమైంది. విద్యుత్తు కోతలు సర్వసాధారణమయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పనున్నది. ఉష్ణోగ్రతలు, ఎండలు మరింత పెరిగి తీవ్ర కరువు పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కడంపై సర్కార్ దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా విద్యారంగంపై మందస్తు కార్యాచరణ కొరవడింది. కరువు వల్ల ఇప్పటికే విద్యాసంస్థల్లో నీటి కొరత తీవ్రమైంది. దీంతో ఇటీవల బాసరలోని ఆర్జీయూకేటీని మూసివేశారు. విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
రానున్న వేసవిలో పరిస్థితులు మరింత అదుపు తప్పితే విద్యార్థులకు పరీక్షల నిర్వహణ సవాల్‌గా మారనున్నది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో కరువు మరింత తీవ్రరూపం దాల్చుతుందని, దీంతో తాగునీరు, విద్యుత్తు రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయన్న అంచనాలున్నాయి. ఆ సమయంలోనే డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ తదితర పరీక్షలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ పరీక్షలు జరుగాల్సి ఉన్నది. ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్-2, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు కూడా ఇదే మాసాల్లో జరుగనున్నాయి. నీట్-యూజీ ప్రవేశ పరీక్షను తొలిసారి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. వీటన్నింటికి నిరంతర విద్యుత్తు సరఫరా తప్పనిసరి. కానీ, విద్యుత్తు కోతలు, పవర్ హాలిడేలు, తాగునీటి సమస్యల వల్ల ఈ పరీక్షల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది.
కరెంట్ ఉంటేనే పరీక్షలు
ప్రవేశ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో జరగాల్సినవే. కంప్యూటర్లు, సర్వర్లు, నెట్వర్క్ వ్యవస్థలన్నీ నిరాటంకంగా పనిచేయాలంటే విద్యుత్తు తప్పనిసరి. వీటిలో ఒక్కో పరీక్ష నిర్వహణకు 3 గంటలపాటు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోజుకు 2 సెషన్లు నిర్వహించాలంటే 6 గంటలపాటు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్తు కోతలు తీవ్రరూపం దాల్చాయి. కరువు ప్రభావంతో మున్ముందు విద్యుత్తు డిమాండ్ మరింత అధికమై సరఫరాపై ఒత్తిడి పెరిగితే పరీక్షల నిర్వహణ సంక్లిష్టంగా మారుతుంది.
వీసీలతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటాం
ఎల్ నినో ప్రభావంపై రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నాం. ఆ తర్వాత ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తాం. హాస్టళ్లు, కాలేజీలకు నీరు, విద్యుత్తు సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులపై సమగ్రంగా చర్చిస్తాం. డిజిటల్ లెర్నింగ్ ఏర్పాట్లపైనా సమీక్షిస్తాం. తద్వారా చదువులకు ఆటంకం కలగకుండా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయబోతున్నాం.
– ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

