హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని రెవెన్యూభవన్‌లో ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కే గౌతమ్‌కుమార్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా మన్నె ప్రభాకర్, పీ రాజ్‌కుమా ర్, ఎండీ రియాజుద్దీన్, పూల్ సింగ్హన్, కోశాధికారిగా బీ వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షులుగా ఎల్బీ శాస్త్రి, బాణాల రాంరెడ్డి, కే శ్రీనివాస్‌రావు, ఏ రాజేశ్వర్, డీ మధుసూదన్, కే నిరంజన్‌రావు, కే నాగమణి, ఎండీ అన్వర్, క్రీడలు, సాంసృతిక కార్యదర్శిగా బీ రవీందర్, కార్యదర్శులుగా శ్రీకాంత్‌రెడ్డి, పీ యాదగిరి, టీ వాణిరెడ్డి, కే మంజుల, మాధవిరెడ్డి, పల్నాటి శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్ చక్రవర్తి, కే వెంకట్‌రెడ్డి, సయ్యద్ మౌలానా, చిల్లా శ్రీనివాస్, కృష్ణచైతన్య, శ్రీనివాస్ దేశ్ పాండేలతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రెవెన్యూ శాఖ పటిష్ఠత, ఉద్యోగుల సంక్షేమం, హకుల కోసం ట్రెసా నిరంతరం పనిచేస్తుందని కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సీసీఎల్ఏ యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.