విద్యుత్తు పీఆర్సీ కమిటీని నియమించండి
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. పీఆర్సీ గడువు ముగిసినందున 2026 పీఆర్సీ కమిటీని నియమించాలని కోరింది.
- తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. పీఆర్సీ గడువు ముగిసినందున 2026 పీఆర్సీ కమిటీని నియమించాలని కోరింది. డిప్యూటీ సీఎం భట్టిని జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్టు జేఏసీ నేతలు తెలిపారు.
విద్యుత్తు ఉద్యోగులకు 2.543% డీఏను మంజూరుచేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో డీఏ 19.272% నుంచి 21.815శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. విద్యుత్తు పీక్ డిమాండ్ 20,018 మెగావాట్లు నమోదైనా విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు అవిశ్రాంతంగా పనిచేశారని.. రాబోయే రోజుల్లోనూ ఇలాగే పనిచేస్తారని జేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. జేఏసీ కన్వీనర్ పీ రత్నాకర్‌రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, వెంకటేశ్వర్లు, వజీర్, పీ సదానందం, శ్రీకాంత్ తదితరులు భట్టిని కలిశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

