హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగా ణ) : తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన బుధవారం ఏపీలోని బొబ్బిలి జైలు నుంచి విడుదలయ్యా రు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఏపీ ప్రభుత్వంపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయనను ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తె లిసిందే.
హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ ప రిధిలో అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్ర యత్నించిన క్రమంలో వివాదం చోటుచేసుకున్నది. భర్త అరెస్టును అడ్డుకున్న కేవీఆర్ భార్యపై ఏపీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై తెలంగాణలో కేసు నమోదు కాగా.. అటు ఏపీలోనూ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఓ మ హిళపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ప్రభుత్వం బదిలీ చేసింది. బొబ్బిలి నుంచి బెయిల్ రావడంతో.. విజయవాడ పరిధిలోని తొర్రూరుకు చెందిన పోలీసులు మళ్లీ అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.