తిమ్మాజిపేట : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ( Telangana Grameena Bank ) ఆధ్వర్యంలో ఖాతా దారులకు పలు రకాల సేవలు అందిస్తున్నామని అదనపు జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి ( AGM Sridhar Reddy ) తెలిపారు. శనివారం ఆవంచలోని బ్యాంక్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బ్యాంక్ ఆధ్వర్యంలో బీమా పథకంలో చేరి, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు చెక్కులను ( Checks ) అందజేశారు.
అమ్మపల్లి గ్రామానికి చెందిన నరసింహులు బ్యాంకు ద్వారా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పథకంలో చేరాడు. ప్రమాదవశాత్తు అతను మరణించడంతో అతని కుటుంబానికి రూ.20 లక్షల చెక్కును అందజేశారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఉండి మరణించిన పెద్ద మల్లయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, శంకర్ జి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ బ్యాంకు ద్వారా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సేవలందిస్తున్నామని, సామాజిక భద్రత పథకాలను అందిస్తున్నామని వివరించారు. రైతులకు పంట రుణాలు, యువతకు, మహిళా సంఘాలకు స్వయం ఉపాధి పథకాల రుణాలు ఇస్తున్నామని తెలిపారు. బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారి రంజిత్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ సునీల్ కుమార్, అధికారులు అశోక్ యాదవ్, హరీష్, వెంకటేష్, మిథున్, సురేష్ రెడ్డి, నరేష్, శివ తదితరులు ఖాతాదారులు పాల్గొన్నారు.