హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి ఈ నెల16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగ ల సాగర్ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీ సీ క్రాస్‌రోడ్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్లను సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు లెల్లెల బాలకృష్ణ, ఉడత రవీందర్‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. సాగు పనులు మొదలైనా ప్రభుత్వం నుంచి రైతుల కు అందాల్సిన పెట్టుబడి సాయం అం దకపోవడం శోచనీయమని అన్నారు.
యాసంగి, వానకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, పెం డింగ్‌లో ఉన్న వానకాలం, యాసంగి పంటల బోనస్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను ముంచే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన పొటాష్, భాస్వరం, కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలన్నారు. యూరియా యాప్ రద్దు చేసి, రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని కోరారు. రైతు డిస్కమ్ నిర్ణయాన్ని తక్షణమే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.