కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
Telangana ENC wrote a letter to KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును

హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును లేఖలో ప్రస్తావించారు. తాగునీటి వినియోగాన్ని 20శాతంగానే పరగణించాలని బోర్డును కోరారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగా లెక్కించాలని, 15 శాతంగానే లెక్కించాలని ఇటీవల సీడబ్ల్యూసీ పేర్కొందన్నారు. కృష్ణాలో 75.32 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేష్ ట్రైబ్యునల్‌ను కోరుతున్నామని, 75.32 టీఎంసీల్లో 20 శాతాన్ని తాగునీటిగా లెక్కించాలన్నారు.
20 శాతం ప్రకారం 15.06 టీఎంసీలను తాగునీటిగా పరిగణించాలని లేఖలో ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. మరో వైపు జలసౌధలో కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీతో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ సమావేశమయ్యారు. ఆయా బోర్డుల పరిధిలో గెజిట్ నోటిఫికేషన్ అమలును సమీక్షించారు. ఇరు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం వివరించగా.. దేవశ్రీ జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

