దీపావళి తర్వాత దంగల్!
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉద్యోగ సంఘాల నాయకులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడే తీరిక అధికారులకు లేకుండా పోయిందని మండిపడింది.
ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరిక
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతాపం చూపుతాం
రేవంత్ సర్కార్‌కు రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ అల్టిమేటం
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉద్యోగ సంఘాల నాయకులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడే తీరిక అధికారులకు లేకుండా పోయిందని మండిపడింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇకనైనా చొరవ చూపకపోతే దీపావళి తర్వాత ఉద్యమబాట పడుతామని హెచ్చరించింది.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతాపం చూపుతామని హెచ్చరికలు జారీచేసింది. ఎంప్లాయీస్ జేఏసీ సమావేశాన్ని శుక్రవారం నాంపల్లిలోని టీజీవో భవన్లో నిర్వహించారు. అనంతరం ప్రెస్మీట్లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. సీఎస్ సహా కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నాయకులకు కనీస విలువ ఇవ్వడంలేదని, తాము ఫొటోషూట్ల కోసం వెళ్లినట్లుందే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో అత్యంత గోప్యత, వివక్ష చూపుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరికి.. ఎంత విడుదల చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుల్లో కేసులు వేసిన వారికే ఐదువేల కోట్లు విడుదల చేస్తే మిగతావారి పరిస్థితేందని ప్రశ్నించారు.
ఎంప్లాయీస్ జేఏసీ నుంచి కోర్టులో కేసు వేస్తే అందరికీ ఇవ్వాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సొంత డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఉద్యోగ సంఘాలు వినతిపత్రాలు సమర్పిస్తే సాయంత్రంకల్లా జీవో వచ్చేది.. లేదంటే తిరస్కరిస్తున్నట్టు మెమో వచ్చేది. ప్రస్తుతం జేఏసీ ఇచ్చిన వినతిపత్రాలపై ఒక్క రిప్లయ్ రాలేదని, ఇంతకాలం వేచిచూశాం, ఇకముందు ఇలా ఉండబోదని హెచ్చరించారు. పీఆర్సీ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ఉద్యోగులు దీపావళి పండుగ సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. దీపావళి తర్వాత మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఎట్లయితే మీ చెవికెక్కుతుంది
ప్రభుత్వశాఖల్లో ఫేస్ రికగ్నిషన్ హాజరును కఠినంగా అమలు చేస్తున్నారని, ఉద్యోగులు గైర్హాజరైతే జీతాలు కోతపెడుతున్నారని మారం, ఏలూరి పేర్కొన్నారు. ఇదే పద్ధతిలో తమకు బకాయిపడ్డ పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని, పీఆర్సీ ఇవ్వాలని, బకాయి పడినందుకు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌పై అధ్యయనానికి కమిటీ వేస్తామన్నారు. ఇంత వరకు వేయలేదు. ప్రతి రెండు నెలలకూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించినా ఇంతవరకు సమావేశం నిర్వహించలేదని పైర్ అయ్యారు. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఉద్యమం చేస్తేనే.. ర్యాలీలు తీస్తేనే.. ఓ రెండు లక్షల మందితో సభ పెడితేనే మీ చెవికెక్కుతుందా? లేకపోతే పట్టించుకోరా అంటూ ఫైర్ అయ్యారు.
ఐదు రోజుల పని విధానంపై రచ్చ
ఎంప్లాయీస్ జేఏసీ సమావేశం హాట్‌హాట్‌గా సాగినట్టు తెలిసింది. వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలన్న జేఏసీ నాయకత్వ ప్రతిపాదనను ఉపాధ్యాయ సంఘాలన్నీ సమావేశంలో ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. అకడమిక్ క్యాలెండర్‌కు ఇది విరుద్ధమని, వాతావరణం పూర్తిగా దెబ్బతింటుందని మెజారిటీ సంఘాలు అభిప్రాయపడ్డాయి. దీంతో విద్యాశాఖ మినహా మిగతా శాఖల్లో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. సమావేశంలో జిల్లా జేఏసీ చైర్మన్లకు మాట్లాడే అవకాశం కల్పించడం లేదని.. ఎందుకోసం మమ్మల్సి సమావేశానికి పిలుస్తున్నారని కొందరు ఫైర్ అయినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

