హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఈనెల 5-9 మధ్య బెంగళూరులో నిర్వహించిన 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ యువ బాక్సర్ ప్రణవ్ శివ రజతంతో సత్తాచాటాడు. అండర్-19 బాయ్స్ 46 కిలోల విభాగంలో అతడు రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.
జాతీయ స్థాయిలో సత్తాచాటడంతో ప్రస్తుతం హకీంపేటలోని తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్స్లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర కీర్తి పతకాన్ని రెపరెపలాడించిన ప్రణవ్ను పాఠశాల ప్రిన్సిపల్, కోచ్, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.