తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 3: రాష్ట్రంలో బార్ల ఫీజులు పెంచడం సరికాద ని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు న్యాయం జరుగకపోతే ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్ పెట్టి నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించింది. రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేసింది.
అనంత రం జరిగిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ మాట్లాడుతూ.. మూడేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని అందిస్తున్న లైసెన్స్‌దారులను వేధించడం తగదని హెచ్చరించారు. రూ.40 లక్షలు ఉన్న ఫీజును రూ.44లక్షలకు పెంచి దౌర్జన్యంగా వసూ లు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ప్రివిలేజ్ అని బార్ స్లాబ్స్ ప్రకారం 8 నుంచి 20 శాతం వరకు అదనంగా వసూ లు చేయాలని జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.