నీతో ఏకాంతంగా గడుపాలి!
ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ ఏయూ) వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్యపై అదే విద్యాసంస్థకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నది.
- ఒక్కసారైనా నాతో ఢిల్లీకి రావాల్సిందే
- నువ్వు 20 ఏండ్ల కింద పుట్టుంటే పెండ్లి చేసుకునేటోన్ని
- అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
- మాట వినకుంటే ట్రాన్స్ఫర్ చేస్తానని వార్నింగ్
- ప్రెస్మీట్లో వివరాలు వెల్లడించిన బాధితురాలు
- ఫిర్యాదు చేసినా కేసు పెట్టని పోలీసులు
దరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ ఏయూ) వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్యపై అదే విద్యాసంస్థకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీసీ వ్యవహారశైలిని మీడియాకు వివరిస్తూ బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. జానయ్య ‘బయోలాజికల్ నీడ్స్ అనే పదం వాడటం, నువ్వు 20 ఏండ్ల క్రితమే పుట్టి ఉంటే నిన్ను పెండ్లి చేసుకునేవాడిని, నీతో ఏకాంతంగా సమయం గడుపాలని ఉన్నది, ఒక్కసారన్న నాతో ఢిల్లీకి రావాల్సిందే’ అంటూ వీసీ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడి తనను మానసికంగా, వృత్తిపరంగా తీవ్ర క్షోభకు గురిచేశారని ఆరోపించారు. ‘నీకు చిన్నచిన్న పిల్లలు ఉన్నారు. నీ భర్త ఎక్కడో అబుదాబిలో ఉంటడు.
నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే ట్రాన్స్ఫర్ చేస్తా’ అని చెప్పేసరికి భయమేసిందని తెలిపారు. ఎందుకంటే ఆయనకు పొలిటికల్ పవర్ ఉన్నది. ఆర్థికంగా కూడా బలవంతుడు.. చాలామంది ఆయనకు మద్దతిచ్చేవాళ్లు కూడా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న తానే ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే ఇక ఎందుకు అనే ఒకే ఒక్క కారణంతో పది రోజుల క్రితం వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కేసును వెనకి తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురవుతున్నాయని పేరొన్నారు. ‘ఈ వ్యవహారం బయటకు వస్తే నీ పరువే పోతుంది, వెంటనే ఫిర్యాదును ఉపసంహరించుకో’ అంటూ బెదిరించడంతో ఇక ఏ దికూతోచక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నేరుగా మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడిస్తున్నట్టు చెప్పారు.
పారదర్శకంగా వ్యవహరిస్తున్నందుకే ఆరోపణలు: మహిళా ఉద్యోగులు
విశ్వవిద్యాలయంలో పరిపాలన, బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నందుకే వీసీపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ బోధన, బోధనేతర మహిళా ఉద్యోగులు స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగులు భార్గవి, మాధవీలత, హేమలత, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు మాట్లాడారు. ఆరోపణలు చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ చాలాకాలంగా హైదరాబాద్‌లో పనిచేస్తుండటంతో మరోచోట 12 ఏండ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఇక్కడకు, అతని స్థానంలో తేజశ్రీని బదిలీ చేశారని అన్నారు. దాంతోపాటు పదవీ విరమణ వయస్సు పెంచలేదన్న అక్కసుతో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

