దీపావళి వేళ..చార్జీల మోత!
పండుగొచ్చిదంటే చాలు.. ఆర్టీసీ చార్జీల మోత మోగాల్సిందే. మొన్నటి వరకు దసరా ప్రయాణాలతో ప్రయాణికులపై రెట్టింపు భారం మోపిన ఆర్టీసీ.. తాజాగా దీపావళికి సైతం చార్జీల ధరలు రెట్టింపు చేసి నడ్డీ విరుస్తున్నది. నగర బస్సులను జిల్లాలకు కేటాయిస్తూ ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి..
-
రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పండుగొచ్చిదంటే చాలు.. ఆర్టీసీ చార్జీల మోత మోగాల్సిందే. మొన్నటి వరకు దసరా ప్రయాణాలతో ప్రయాణికులపై రెట్టింపు భారం మోపిన ఆర్టీసీ.. తాజాగా దీపావళికి సైతం చార్జీల ధరలు రెట్టింపు చేసి నడ్డీ విరుస్తున్నది. నగర బస్సులను జిల్లాలకు కేటాయిస్తూ ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి.. టికెట్ ధరలను పెంచేశారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు సైతం పెరిగిన బస్సు ధరలను సాకుగా చూపి ప్రయాణికులను దోచుకుంటున్నాయి. దీంతో పండుగకు ఊరెళ్లేవారికి జేబు గుల్లా అవుతున్నది. దీపావళికి రెండ్రోజుల ముందు నుంచే జేబీఎస్, ఎంజీబీఎస్, నగర శివారు ప్రధాన ప్రాంతాల బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కుటుంబసమేతంగా ఇంటి బాటపడుతున్నారు. పెరిగిన టికెట్ ధరలపై ప్రయాణికులు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూనే పురుషుల ప్రయాణానికి రెట్టింపు ధరలు పెట్టి డబ్బులు దోచేస్తున్నారంటూ.. నెట్టింట్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు గరుడ బస్సు చార్జీ రూ. 410 ఉండగా, ఎలాంటి స్పెషల్ బస్సు సర్వీస్ లేకపోయినా..
రూ. 580 ఆర్టీసీ వసూలు చేస్తున్నట్లు ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో టికెట్ పోస్ట్ చేశాడు. ఉన్నపళంగా రూ.170 పెంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతీ జిల్లాకు ఇలాంటి తరహాలోనే టికెట్లపై సుమారు 41 శాతం పైగా ధరలు పెంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పాడు. మరోవైపు క్యాబ్స్ సైతం ఒక్కరికి ఉప్పల్ నుంచి హన్మకొండకు రూ.600ల వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికుడు రవి తెలిపాడు. ప్రయాణికుల డిమాండ్‌పై చార్జీలు పెంచుతున్నారన్నారు. పండుగ అంటే ఇంటికి వెళ్లాలంటేనే భయమేస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పండుగ రోజుల్లో జరుగుతున్న దోపిడీని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా టికెట్ ధరలను పెంచడం కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేది సామాన్యులేనని గుర్తించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

