న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘నివసించడానికి అత్యంత ఖరీదైన నగరం’గా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నిలిచింది. ద్రవ్యోల్బణం పెరుగడంతో జీవన వ్యయం కూడా పెరిగిందని, ఈ కారణంగానే టెల్ అవీవ్ ఖరీదైన నగరంగా నిలిచిందని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ తెలిపింది. ముఖ్యంగా సరుకులు, రవాణా ఖర్చులు, ఇంధన ధరలు పెరుగడంతో ప్రజలపై ఆర్థికభారం పడుతున్నదని వెల్లడించింది. టాప్ టెన్ నగరాలు: టెల్ అవీవ్, పారిస్-సింగపూర్ (సంయుక్తంగా), జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్, జెనీవా, కోపెన్‌హాగెన్, లాస్ ఏంజెల్స్, ఒసాకా.