నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఉషా ముల్పూరి నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్నది. టీజర్‌ను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాధిక, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ : శంకర్ ప్రసాద్ ముల్పూరి, సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్.