జైపూర్: టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలో వైదొలిగిన భారత క్రికెట్ జట్టు బుధవారం స్వదేశానికి చేరుకోనుంది. దుబాయ్ నుంచి నేరుగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి చేరుకుని మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఈనెల 17 నుంచి న్యూజిలాండ్తో జరుగనున్న టోర్నీ కోసం భారత ఆటగాళ్లు ఈనెల 14 నుంచి 16 వరకు ప్రాక్టీసు చేయనున్నారు. టీ20 మెగాటోర్నీ అనంతరం న్యూజిలాండ్ భారత్కు రానుంది. ఈ స్టేడియంలోనే రాహుల్ ద్రవిడ్ భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.