బీఆర్టీయూ డ్రైవర్ల ధర్నా.. పెనాల్టీ రద్దు చేసి, రేట్ కార్డు అమలు చేయాలని డిమాండ్
ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను దిగ్బంధిస్తామని బీఆర్టీయూ ట్యాక్సీ విభాగం అధ్యక్షుడు నగేశ్ హెచ్చరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలో మంగళవారం డ్రైవర్లు ధర్నా చేశారు. ఫేర్ ఛార్జీలు పెంచడంతో పాటు ఓవర్ స్టే ఛార్జీలు తగ్గించాలని ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించారు.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను దిగ్బంధిస్తామని బీఆర్టీయూ ట్యాక్సీ విభాగం అధ్యక్షుడు నగేశ్ హెచ్చరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలో మంగళవారం డ్రైవర్లు ధర్నా చేశారు. ఫేర్ ఛార్జీలు పెంచడంతో పాటు ఓవర్ స్టే ఛార్జీలు తగ్గించాలని ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగేశ్ మాట్లాడుతూ డిపార్చర్లో కస్టమర్‌ను డ్రాప్ చేసిన తర్వాత ఓవర్‌స్టే పేరుతో 8 నిమిషాలకు రూ. 500 పెనాల్టీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కిలోమీటర్ రేట్ కార్డు అమలు చేయాలని కోరారు. ఓలా, ఉబర్, ర్యాపిడోతో పాటు ఇతర అగ్రిగేటర్ కంపెనీల్లో నడుస్తున్న ట్యాక్సీలకు 2022లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిలోమీటర్ రేట్లకు తగ్గకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రేట్ కార్డును అమలు చేయాలన్నారు. కొత్త రేట్లను రవాణా శాఖ, కార్మిక శాఖ, జీఎంఆర్, ఓలా, ఉబర్, ర్యాపిడో ఇతర అగ్రిగేటర్ కంపెనీలు తక్షణమే అమలు చేయాలన్నారు. సమస్యలు ఈనెల 28లోపు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

