న్యూఢిల్లీ, జనవరి 19: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..తాజాగా సీఎన్జీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. టియాగో, టిగోర్ ట్రిమ్‌లను సీఎన్జీ వెర్షన్లో ప్రవేశపెట్టింది. ఈ కారు రూ.6.09 లక్షల నుంచి రూ.8.41 లక్షల మధ్యలో లభించనున్నది. వీటిలో టియాగో సీఎన్జీ రూ.6.09 లక్షల నుంచి రూ.7.64 లక్షల మధ్యలోనూ, టిగోర్ ఐసీఎన్జీ మోడల్ రూ.7.69 లక్షల నుంచి రూ.8.41 లక్షల మధ్యలో లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.