CM Vijay Vs GM Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్ పెట్టిన ప్రజ్ఞానంద.. వీడియో
CM Vijay Vs GM Praggnanandhaa: తమిళనాడు సీఎం విజయ్.. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఇవాళ చెస్ ఆడారు. సరదాగా ఆడిన ఆ గేమ్‌లో సీఎం విజయ్ ఓడిపోయారు. తాజాగా నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద సెక్రటేరియేట్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ ఫన్నీగా ఓ గేమ్ ఆడారు.
చెన్నై: నార్వే చెస్ టైటిల్ గెలిచిన గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద.. అదే ఊపులో ఉన్నారు. ఇవాళ తమిళనాడు సీఎం విజయ్‌ని కూడా ప్రజ్ఞానంద ఓ గేమ్(CM Vijay Vs GM Praggnanandhaa)లో ఓడించారు. నార్వే టైటిల్ గెలిచిన సందర్భంగా సీఎం విజయ్‌ని ఆ రాష్ట్ర సెక్రటేరియేట్‌లో ప్రజ్ఞానంద కలిశారు. ఆ సమయంలో ఇద్దరూ కాసేపు సరదాగా చెస్ ఆడారు. అయితే కేవలం కొన్ని ఎత్తుల్లోనే సీఎం విజయ్‌కు గ్రాండ్‌మాస్టర్ చెక్ పెట్టేశారు. చెస్ స్టార్ ప్రజ్ఞానందకు 50 లక్షల ప్రత్యేక నజరానా సీఎం అందజేశారు. అయితే సీఎం విజయ్ చెస్ ఆడిన తీరును ప్రజ్ఞానంద మెచ్చుకున్నారు. సీఎంతో చెస్ ఆడడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందన్నాడు. విజయ్, ప్రజ్ఞానంద చెస్ ఆడిన విలువల్స్ను రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నగదు పురస్కారం తనలో ప్రేరణ ఇస్తోందన్నారు. సీఎం విజయ్ చెస్ ఆడుతారన్న సంగతి తనకు తెలియదని, చెస్ బోర్డు తెమ్మన్నారని, టేబుల్‌పై చెస్ ఆడామని ప్రజ్ఞానంద తెలిపారు. తన స్నేహితులతో కలిసి చెస్ ఆడేవాడినని సీఎం విజయ్ చెప్పినట్లు తెలిపారు. గేమ్ నేనే గెలిచినా, సీఎం బాగా ఆడారని అన్నాడు.
#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.
(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX
— ANI (@ANI) June 8, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

