Suvvi Suvvi | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇటీవలే రిలీజ్ అయిన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట అభిమానుల్లో మంచి హైప్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మెలోడీ లవ్ సాంగ్‌ను విడుదల చేసింది మూవీ టీం. వినాయక చవితి పండగ సందర్భంగా ‘ఓజీ’ రెండో సింగిల్ ‘సువ్వి సువ్వి’ ని ఆగస్టు 27వ తేదీ ఉదయం 10:08 గంటలకు విడుదల చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్‌లపై చిత్రీకరించిన రొమాంటిక్ మూడ్ కనిపించనుంది. పండుగ వాతావరణం, అందమైన కెమిస్ట్రీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతకు ముందు రిలీజ్ అయిన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ పదాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. “పగ రగిలిన ఫైరు…” అనే లైన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పాటకు అర్థం తెలుసుకోవాలన్న ఆసక్తితో యూట్యూబ్, ట్విట్టర్లో ఫ్యాన్స్ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ‘ఓజీ’ షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని స్పష్టమైన క్లారిటీతో మూవీ టీం ముందుకొచ్చింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, విడుదల తేదీగా ప్రకటించిన సెప్టెంబర్ 25 లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ సెప్టెంబర్ 24 నుంచే మొదలవనున్నాయి. ఆగస్టు 29 నుంచి అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రానికి తినే కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే, ‘ఓజీ’ మ్యూజికల్ ప్రమోషన్స్ పీక్స్‌లోకి చేరుతున్నాయి. ‘ఫైర్ స్ట్రోమ్’ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగగా, ‘సువ్వి సువ్వి’ లవ్ ఎమోషన్‌తో డిఫరెంట్ వైబ్స్ అందిస్తుంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు.