సూర్యాపేట టౌన్: పార్టీలకతీతంగా అన్ని రంగాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. పేదల బాదలెరిగిన నాయకుడుగా సీఎం కేసీఆర్ అందరికి అండగా నిలుస్తున్నారని.. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తమ సొంతం చేసుకుని ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా 80 మంది బాధిత కుటుంబాలకు సుమారు రూ.50లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. పేదల బాధలేరిగిన నాయకుడిగా ప్రతి పేదవాడి కడుపు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో ఆకలిని పార ద్రోలి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దార్శనికతకు పెట్టింది పేరు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎన్నో చూశామని.. పోరాడి సాధించిన తెలంగాణలో వాటిని పూర్తిగా రూపుమాపుకున్నామన్నారు. కేవలం ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని.. దీంతో నేడు తెలంగాణ ప్రజలుగా గర్వంగా జీవనం సాగిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయం దండుగ అనే పరిస్థితులు ఏర్పడడమే కాకుండా 10 నుంచి 15 ఎకరాల ఆసాములందరూ వలసలు పోయి కూలీలు చేసుకున్న దుర్బర పరిస్థితులు ఇంకా కళ్లేదుటే సాక్షాత్కరిస్తున్నా యన్నారు. అటువంటి విపత్కర పరిస్ధితుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా ప్రజల ఆశీసులతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల అభివృధ్ధితో పాటు వ్యవసాయనికి స్వర్ణయుగం సృష్టించారన్నారు.
భారతదేశం గర్వించే పద్దతిలో మిషన్ భగీరధ పథకంతో సురక్షితమైన మంచినీరు ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. అంతేకాకుండా నిరంతర విద్యు త్, పుష్కలంగా తాగుసాగు నీరందిస్తూ ప్రశాంత వాతావరణంలో అన్ని రంగాలను రాజకీయాలకతీతంగా తీర్చిదిద్దుతున్నా రన్నారు.
గతంలో ఏ ప్రభుత్వ పథకమైనా ఆయా పారీల నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే అందేవని కానీ నేడు అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులందరికీ లభ్ధిచేకురుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చై ర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీలు బీరవోలు రవీందర్ రెడ్డి, నెమ్మా ది భిక్షం, కుమారిబాబు, జడ్పీటీసీలు జీడి భిక్షం, మామిడి అనీతఅంజయ్య, సంజీవ నాయక్‌లతో పాటు ప్రజా ప్రతి నిధు లు, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.