సూర్యాపేట అర్బన్, డిసెంబర్ 2 : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకోని వారి వివరాలను కలెక్టర్‌కు అందించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించడంలో మండల విద్యాధికారులు, హెచ్ఎంలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
సూర్యాపేట రూరల్ : ప్రతి గ్రామంలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు ఆదేశించారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులకు వ్యాక్సినేషన్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ చివరి నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ వెంకన్న, మండల వైద్యాధికారి సంధ్య, సీడీపీఓ కిరణ్మయి, ఎంపీఓ పరాంకుశరావు, ఏపీఓ వెంకన్న పాల్గొన్నారు.
రైతులు, హమాలీలకు కరోనా టీకాలు..
తిరుమలగిరి : తొండ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు, హమాలీలకు వైద్య సిబ్బంది కరోనా టీకాలు వేశారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎం నర్సయ్య పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌కు సహకరించాలి
బొడ్రాయిబజార్ : జిల్లా కేంద్రంలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ప్రజలంతా సహకరించాలని కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, వార్డు అధికారి ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ కోరారు. పట్టణంలోని 34వ వార్డులో ఇంటింటికీ వ్యాక్సినేషన్ నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, సాలెహ, ఆర్పీలు రోజా, అశ్విని, ఏఎన్ఎం జి.ధనమ్మ, ఆశ వర్కర్ సక్కుబాయి, జవాన్ గురునాథ్ పాల్గొన్నారు.