Tarun Tejpal | ఢిల్లీ: తరుణ్ తేజ్పాల్ రెండు వారాల్లోగా లొంగిపోండి అని సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ 2013లో తనపై అత్యాచారం చేశాడని సహోద్యోగిని కేసు పెట్టింది. దీనిపై విచారించిన బాంబే హైకోర్టులోని ఒక బెంచ్ 2021లో నిర్దోషిగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై గోవా ప్రభుత్వం సవాల్ చేయగా ఆ తీర్పును రద్దు చేస్తూ పదేండ్ల కారాగార శిక్షను విధించింది.
ఈ తీర్పుపై సవాల్ చేస్తూ తరుణ్ తేజ్పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గోవా (Goa) ప్రభుత్వం కూడా తరుణ్ శిక్షను పెంచాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయంలో మంగళవారం వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. తరుణ్ తేజ్పాల్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తేజ్పాల్ శిక్షపై బాంబే హైకోర్టు స్టే విధించిందని వాదించారు. అందువల్ల అతడిని మళ్లీ లొంగిపొమ్మని చెప్పడం తగదని అన్నారు. కపిల్ సిబల్ వాదనలను జస్టిస్ అలోక్ అరాధే తోసిపుచ్చి ఈ తీర్పు వెలువరించారు.