వెల్దండ : పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘ మన కుటుంబం ( Mana family movie) ’ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సినీ నిర్మాత కలకొండ నరసింహులు ( Kalakonda Narasimhulu) , సినీ హీరో రవివర్మ( Hero Ravi Varma) కోరారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, ఆమనగల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్లో మొదటి రోజు పూజా కార్యక్రమానికి నిర్మాత నరసింహులు, హీరో రవి వర్మ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద , మధ్యతరగతి కుటుంబాల జీవన స్థితిగతులు, పల్లెటూరి నేపథ్య కోణంలో సినిమాను తెరకెక్కించినట్లు వారు తెలిపారు. మూడు గంటల సినిమా ప్రజలను వినోదం, ప్రేమ, కుటుంబ నేపథ్యంలో 4 పాటలు,3 ఫైటింగ్ లతో ఎంతో ఆకట్టుకుంటుందని వెల్లడించారు . సినిమాలో సినీ హీరో సుమన్, అన్నపూర్ణమ్మ, మురళీధర్ గౌడ్ ముఖ్యపాత్రలో నటించిన తెలిపారు. సినిమా హీరో, హీరోయిన్లను ఏకతాటి పైకి వచ్చి సినిమాకు చక్కని సందేశాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆమనగల్లు, అచ్చంపేట, కర్మన్ గట్టు, కూకట్పల్లి, మల్కాజిగిరి , ఉప్పల్, అత్తాపూర్, శాలిబండ, బంజారాహిల్స్, కాచిగూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ముసరాంబాగ్, ఎర్రమంజలి, తదితర థియేటర్లో సినిమా ప్రదర్శింపబడుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. అంతకుముందు జాతీయ బీసీ మాజీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, అజిలాపూర్ మొగులయ్య , కాంగ్రెస్ నేత మల్లెపల్లి జగన్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.