పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
పంటలను కాపాడేందుకు ప్రభుత్వం కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఆరుతడి పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేషన్ కార్డుపై ఒకో వ్యక్తికి 12 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- రాష్ర్టానికి కేంద్రం 50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి: సీపీఎం
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పంటలను కాపాడేందుకు ప్రభుత్వం కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఆరుతడి పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేషన్ కార్డుపై ఒకో వ్యక్తికి 12 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బియ్యం ధరల్ని నియంత్రించాలని కోరారు. కరువు సాయం కింద కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయాలని పేర్కొన్నారు.
శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యు లు విజయరాఘవన్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టీ జ్యోతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయరాఘవన్ మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కేం ద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని చెప్పారు. ఓట్ల తొలగింపు వల్లనే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశ సమైక్యత కోసం కృషిచేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం విడ్డూరమని రాఘవులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

