సూపర్ మహిళ
వయసు మీదపడుతున్న కొద్దీ మహిళలను శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. అనేక రుగ్మతలు వెంటాడుతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ సూపర్ ఫుడ్స్ చాలా అవసరం..
వయసు మీదపడుతున్న కొద్దీ మహిళలను శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. అనేక రుగ్మతలు వెంటాడుతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ సూపర్ ఫుడ్స్ చాలా అవసరం..
పాలు: వయసు పెరిగేకొద్దీ మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గుతూ వస్తుంది. ఆస్టియోపొరోసిస్ లాంటి
ఎముకల వ్యాధులు తీవ్రం అవుతాయి. ఆ ప్రభావాన్ని పాలు అడ్డుకుంటాయి. పాలలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రత తగ్గకుండా చూస్తుంది. వయసుతోపాటు తలెత్తే వివిధ సమస్యలనూ నివారిస్తాయి.
యోగర్ట్: నడి వయసుకు చేరుకుంటున్న దశలో మానసిక, శారీరక వ్యాధులు చుట్టుముట్టడం సహజమే. ఇలాంటి స్థితిలో.. ఎముకల వ్యాధులు, మానసిక సమస్యలు, ప్రీ-మెనోపాజ్ లక్షణాల ముప్పును నివారించడానికి యోగర్ట్ దోహదపడుతుంది. ఇందులో క్యాల్షియం, విటమిన్-బి12, రిబోఫ్లేవిన్ పుష్కలం.
పాలకూర: పాలకూర లాంటి తాజా ఆకుకూరల్లో విటమిన్-సి తదితర పోషకాలు దండిగా ఉంటాయి.
పాలకూరలోని యాంటీఆక్సిడెంట్, ఫినాలిక్ మిశ్రమాలు సీరం యాంటీఆక్సిడెంట్స్‌ను పెంచుతాయి. ఫ్రీ
ర్యాడికల్స్‌ను తగ్గిస్తాయి. వయసు మీదపడటాన్ని వాయిదా వేస్తాయి.
అవిసె గింజలు: వీటిలో ఫైటో ఈస్ట్రోజెన్స్తోపాటు, లినోలెనిక్ యాసిడ్, విటమిన్-ఎ, సి, పొటాషియం లాంటి పోషక పదార్థాలు పుష్కలం. అవిసె గింజల్లో లభించే ఈస్ట్రోజెన్ వల్ల మహిళల శరీరంలోని వివిధ హార్మోన్లు సమతూకంలో ఉంటాయి. దీంతో వయసు పెరిగేకొద్దీ అధికం అయ్యే ప్రత్యుత్పత్తి సమస్యలు పరిష్కారం
అవుతాయి.
బ్లూ బెర్రీ: వయసు పైబడిన మహిళల్లో మతిమరుపు సమస్యను తగ్గిస్తాయి. విటమిన్-సి, కె, మాంగనీస్ లాంటి యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని, నాడుల పనితీరును మెరుగుపరుస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- Super foods
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

