సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్ పట్టాలెక్కింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శరణ్ కొప్పిశెట్టి క్లాప్‌కొట్టారు. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ ఎరబోలు సమర్పిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ ఈ సినిమాలో ఆర్జే క్యారెక్టర్లో కనిపించనున్నారు.