e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News స్టైలిష్ స్టార్‌ను ఐకాన్‌ స్టార్‌గా మార్చిన సుకుమార్

స్టైలిష్ స్టార్‌ను ఐకాన్‌ స్టార్‌గా మార్చిన సుకుమార్

స్టైలిష్ స్టార్‌ను ఐకాన్‌ స్టార్‌గా మార్చిన సుకుమార్

తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అంటే అల్లు అర్జున్ గుర్తొస్తాడు. ఈయన మూడో సినిమా బన్నీకి మెగాస్టార్ చిరంజీవి ఈ బిరుదు ఇచ్చాడు. అయితే స్టైలిష్ స్టార్ నుంచి తన రేంజ్ చాలా పెంచుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ ఉన్న పొజిషన్ కు ఆయన మార్కెట్ కు స్టైలిష్ స్టార్ అనే బిరుదు అసలు సరిపోదు. అందుకే బాగా ఆలోచించి సుకుమార్ ఈయన బిరుదు మార్చేశాడు. ఇప్పటినుంచి అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్. పుష్ప సినిమాలో ఈయన పేరు ఇలాగే పడుతుంది. తాజాగా విడుదలైన పుట్టినరోజు టీజర్లో అల్లు అర్జున్ పేరు ముందు ఐకాన్ స్టార్ అని ఆడ్ చేశారు. అంటే ఇప్పటి నుంచి అల్లు అర్జున్ పేరు మారిపోయింది అన్నమాట. స్టైలిష్ స్టార్ అనడం ఆపేయాలి.

ఇదే విషయాన్ని టీజర్ లాంచ్ వేడుకల్లో అల్లు అర్జున్ కూడా చెప్పాడు. తనను ఇప్పటినుంచి ఐకాన్ స్టార్ అంటుంటే ఆనందంగా ఉంది అని.. ఈ పేరు నిలబెట్టుకోవడానికి తాను ఇంకా చాలా కృషి చేస్తాను అంటున్నాడు. ఇదిలా ఉంటే పుష్ప టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో అల్లు అర్జున్ లుక్కుతో పాటు విజువల్స్ కూడా పిచ్చెక్కిస్తున్నాయి. కచ్చితంగా రంగస్థలం కంటే పెద్ద హిట్ సినిమాతో సుకుమార్ అందుకునేలా కనిపిస్తున్నాడు. పుష్ప రాజ్ పాత్ర కోసం పూర్తిగా ప్రాణం పెట్టేసాడు బన్నీ.

కచ్చితంగా ఈ సినిమాతో తన పాన్ ఇండియా స్టార్ అవుతాను అని ధీమాగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈయనకు ఉత్తరాదిన కూడా అదిరిపోయే ఇమేజ్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలు హిందీలో అనువాదమై అక్కడ రికార్డు వ్యూస్ సాధిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా పుష్ప సినిమాతో వాళ్ళ ముందుకు వెళుతున్నాడు అల్లు అర్జున్. మరి ఈ ఐకాన్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి.

Advertisement
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్‌ స్టార్‌గా మార్చిన సుకుమార్

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement