Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందులకు చెందిన దావులగల్ల లాస్య సిద్దిపేట మండలం రాఘవపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
తొగుట : కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందులకు చెందిన దావులగల్ల లాస్య సిద్దిపేట మండలం రాఘవపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరోగ్యంగా ఉన్న లాస్య దసరా సెలవుల అనంతరం యథావిధిగా హాస్టల్‌కు వెళ్లింది. అయితే, అనూహ్యంగా ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పాఠశాల నుంచి లాస్య తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. లాస్య పుష్పవతి అయిందని సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో హాస్టల్‌కు వెళ్లిన తల్లిదండ్రులకు, అప్పటికే లాస్య ఆరోగ్యం క్షీణించడంతో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు.
అయితే, హాస్పిటల్‌కు చేరుకునే సమయానికే లాస్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె ఆకస్మికంగా మృతి చెందడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాస్య మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం లాస్య మృతదేహం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
Maharastra | సీఎం ఫడ్నవీస్ ఇలాకాలో బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

