అన్ని గుడ్లూ ఒకే బుట్టలో పెట్టకూడదని సామెత. ఒకే ఆర్థిక సాధనంలో మదుపు చేయడంవల్ల రిస్క్ ఎక్కువ. వివిధ ఆర్థిక సాధనాల్లోనూ, ఆస్తుల్లోనూ మదుపు చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. దేశ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు రాబడుల్లోనూ తేడాలుంటాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నప్పుడు ఆర్థిక సాధానాల్లో రాబడులుండవు. ప్రత్యామ్నాయంగా బంగారం, స్థిరాస్తులపై పెట్టుబడులు రిస్క్‌ను తగ్గిస్తాయి. పరిస్థితులకు తగ్గట్టు పొదుపు, మదుపు చేయడం వల్ల కూడా రిస్క్‌ను తగ్గించుకోవడంతోపాటు ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం తేలిక అవుతుంది.