హనుమకొండ చౌరస్తా : ఫీజు రీయింబర్స్మెంట్ ( Fees Reimbursment ) పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ ( Colleges Bandh ) కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ ( ABVP ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు విడుదల చేయని కారణంగా 11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని,వేల మంది సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు .
కార్యక్రమంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ మడూరి. సందీప్ రావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూపల్లి దీపిక, విభాగ్ కన్వీనర్ ఆరిపెల్లి సుజిత్, జిల్లా కన్వీనర్ బెల్లం కార్తీక్, స్టేట్ హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్, గుగులోత్ నవీన్, సిద్ధూ పాల్గొన్నారు.