టాలీవుడ్లో నయా సెన్సేషన్ శ్రీలీల. ఏ కొత్త సినిమా ప్రకటించినా అందులో ఆమె పేరు వినిపిస్తున్నది. కన్నడలో నాయికగా అరంగేట్రం చేసిన ఈ తార ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు తెరకొచ్చింది. ఈ ఒక్క సినిమా ఆమెకు దాదాపు అరడజను ప్రాజెక్ట్లు తీసుకొచ్చింది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలకు క్రేజ్ తగ్గిపోగా..ఆ స్పేస్ శ్రీలీలకు కలిసొచ్చింది. రవితేజ సరసన ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ చిత్రాల్లో నటిస్తున్న ఈ నాయిక మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రంలో ఒక హీరోయిన్గా ఎంపికైంది. నితిన్, దర్శకుడు వక్కంతం వంశీ సినిమాతో పాటు కిరిటీ హీరోగా నటిస్తున్న తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రాన్నీ ఖాతాలో వేసుకుంది. ఆమెను మరికొన్ని చిత్రాలకు సంప్రదిస్తున్నారని సమాచారం. ఇవీ సెట్స్ మీదకు వెల్తే కొన్నేళ్ల పాటు శ్రీలీలకు ఏ లోటూ ఉండకపోవచ్చు.