Sreeleela | టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా ఎదుగుతున్న శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్,ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చిన కథలు, పాత్రలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే ఆమె కెరీర్‌కు మలుపు తిరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర చిత్రంలోనూ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీల అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితం, ఆలోచనలను పంచుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా ఫర్వాలేదు కాని, కానీ తనను బాగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలని శ్రీలీల పేర్కొంది. అలాగే తన సినీ కెరీర్‌కు మద్దతుగా నిలిచి, ప్రేమతో చూసుకునే వ్యక్తి, సరదాగా ఉండే వ్యక్తి, అన్నింటికంటే ముఖ్యంగా నిజాయితీగల వ్యక్తి కావాలని తెలిపింది. “అలాంటి వ్యక్తి ఎదురైతే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను” అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో తాను ఇటీవల తెలుగు సినిమాల్లో కొంత తక్కువగా కనిపించడం గురించి మాట్లాడుతూ, “కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసంఎదురుచూస్తున్నాను. అలాంటి మంచి పాత్ర లభిస్తే ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె నిజాయితీని ప్రశంసిస్తూనే, కొందరు “ఇదంతా ప్రేమలో ఉన్న సంకేతమేనా?” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, తన స్పష్టమైన ఆలోచనలతో, నిజాయితీతో శ్రీలీల మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.