గుండెల్లో ఎగురుతుంది గులాబి జెండా
మన తెలంగాణ జనమందరి అండా దండా
పల్లవి: గుండెగుండెలో ఎగురుతుంది గులాబి జెండా
మన తెలంగాణ జనమందరి అండా దండా
ఎన్నో త్యాగాలపైన ఎత్తిన జెండా
మన ఆత్మగౌరవాన్నే ఎలుగెత్తిన జెండా
చంద్రశేఖరన్న చైతన్యం చాటిన జెండా
గ్రామ గ్రామాన ఆ స్ఫూర్తిని నింపిన జెండా
సొంత రాష్ర్టాన్నే సాధించిన ఉద్యమ జెండా
ఇది తెలంగాణ రాష్ట్రసమితి జెండా
అరవై ఏండ్ల గోస దీర్చినదీ జెండా
మన కేసీయార్ సారు సల్లగుండా
టీఆరెస్సే మన ఆశల పూదండా
చరణం: తెలంగాణ పేరు అపుడు పలకాలంటే
పెద్ద నేరమేదో జేసినట్టు వెలివేస్తుంటే
మన నేలన ఉంటూ మన తిండే తింటూ
మన భాషను మన యాసను హేళన జేస్తే
అడుగడుగున అణచివేత సాగిస్తుంటే
మన నీళ్ళు మన నిధులను అటు మల్లిస్తుంటే
తిరగబడి ఎవరైనా యుద్దం జేస్తే
దాన్ని ఆదిలోనే కుట్రజేసి ఆపేస్తుంటే
ఎదురు తిరిగి కేసీయారు ఎత్తిన జెండా..
సారు ఒంటరి యుద్ధానికండాదండా
ఎన్ని గడపలెక్కినాడో దించకుండా
అన్న కేటీఆర్ అందుకున్న జెండా
తోటి యువతరాల మేలుకొలుపు జెండా..
చరణం: ఎన్నెన్నో త్యాగాలు పోరాటాలు
అన్నింటికీ సాక్ష్యంగా నిలిచిన జెండా
ఉద్ధండులతోనే ఘన యుద్ధం చేసీ
అరువైయ్యేండ్ల కలనే నెరవేర్చిన జెండా..
కల్వకుంట్ల చంద్రశేఖరన్న ఎదలో
గూడు కట్టుకొని ఉన్న ఆవేదనలెన్నో
తెలంగాణ నేల జనం గోసలు దీర్చి
ప్రతి పల్లె ప్రతి ఇల్లు వెలగాలనుకుండో..
సొంత పరిపాలనకే జైకొట్టిన జెండా
కేసీయారు జన సంక్షేమపు జెండా
ఇది నిఖార్సైన తెలంగాణ జెండా
అన్న కేటిఆర్ ఎత్తుకున్న జెండా
తెలంగాణ యువత భవిష్యత్తీ జెండా..
చరణం: అవ్వ తాతలకు ఆసరగా నిలిచిన జెండా
రైతు బంధు అయ్యి ఆత్మహత్యలాపిన జెండా
ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మయ్యాడు
గర్భిణి స్త్రీలకు కేసీయారు కిట్టయ్యాడు
నేల దాహమే తీర్చగ ఉజ్వల గంగై
ఉప్పొంగిన భగీరథుడు కేసీయారు
అక్కరకొచ్చే పనులను ఒక్కొక్కటిగా
అహర్నిశలు ఆచరణలో పెడుతున్నారు
బంగారు తెలంగాణ బాసట జెండా..
మల్ల బానిసత్వ మాయల పడకుండా
మనల కాపాడే అమ్మలాంటి జెండా
మంచి భవిష్యత్తుకు బాటలేసే జెండా
నమ్ముకుంటే బతుకంతా అండదండా..
ఇది తెలంగాణ రాష్ట్రసమితి జెండా
సకల జనులకు సాయంగా ఉన్న జెండా
మన కేసీయారు సారు సల్లగుండా
అన్న కేటిఆర్ మనకు అండదండా..
సమర్పణ:శంభీపూర్ రాజు
(టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతం)