భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
భూ హక్కుల పరిరక్షణ, భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ చట్టాలపై న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని పానగల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైతు కమిషన్ సభ్యుడు...
– భూ హక్కులు, రికార్డులు, చట్టంలోని సెక్షన్లపై సమగ్ర వివరణ
– రైతు కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్
రామగిరి, నవంబర్ 20 : భూ హక్కుల పరిరక్షణ, భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ చట్టాలపై న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని పానగల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైతు కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ (భూమి సునీల్) తెలంగాణ భూ భారతి (భూ హక్కుల రికార్డుల) చట్టం–2025లోని వివిధ సెక్షన్లు, వాటి ప్రాధాన్యత, అమలు విధానాలపై విద్యార్థులకు వివరించారు. భూ యాజమాన్య హక్కుల నమోదు, వారసత్వ హక్కులు, భూమి బదలాయింపు, రికార్డుల సవరణ, రెవెన్యూ అధికారుల బాధ్యతలు, అప్పీల్ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. భూమి అనేది రైతుల జీవనోపాధి, కుటుంబాల ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న అంశమని, భూ వివాదాల పరిష్కారంలో చట్టాలు, రెవెన్యూ రికార్డులు, సంబంధిత ఆధారాలను సమగ్రంగా పరిశీలించడం అవసరమని పేర్కొన్నారు.
డిజిటల్ భూ రికార్డులు, ఆన్లైన్ సేవలు, పారదర్శకమైన భూ పరిపాలనపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకుల రవి మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు చట్టాల అమలుపై ఆచరణాత్మక అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథం, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.సంజీవరెడ్డి, బి.సునీత, ఆర్.ధనలక్ష్మి, పి.నాగేంద్ర గౌడ్, డి.హేమంత్, ప్రశాంత్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

