ఈ మధ్య గడియారాలూ స్మార్ట్‌గా వస్తున్నాయి. ఈ ‘లెనెవో స్మార్ట్ క్లాక్ 2’కు అయితే స్పీకర్‌ను అటాచ్ చేసుకుని మ్యూజిక్ కూడా వినవచ్చు. వాయిస్ కమాండ్తోనూ పని చేస్తుంది. అంటే పాటలు, ఆటలు, వార్తలు, వాతావరణం.. ఇలా మనకు కావాల్సిందేమిటో చెబితే చాలు. దానంతట అదే ట్యూన్ అవుతుంది. అదనంగా వైర్లెస్ చార్జింగ్ డాక్గానూ పనిచేస్తుంది. ఒకేసారి నాలుగైదు డివైస్‌లను చార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇతర స్మార్ట్ పరికరాలను ఎక్కడినుంచైనా కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ క్లాక్ ధర రూ.6,999/- మాత్రమే.