హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): హెల్మెట్ పెట్టుకొంటే ఉక్కపోత. తల వెంట్రుకల నుంచి చెమట ధారలు కడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే ఆవిష్కరణ చేసిందో సర్కారు స్కూలు విద్యార్థిని. చల్లదనాన్ని ఇచ్చే సోలార్ హెల్మెట్‌ను రూపొందించింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సీపీఎల్ అంబర్‌పేట విద్యార్థిని జయంతి ఈ ఘనత సాధించింది. హెల్మెట్‌కు సోలార్ కూలింగ్‌తో పాటు హెడ్ ల్యాంప్‌ను కూడా అమర్చి అబ్బురపర్చింది.
సోలార్ ప్యానల్, రీచార్జబుల్ బ్యాటరీలు, కంట్రోలర్ స్విచ్, డీసీ మోటర్, చిన్న ఫ్యాన్లు, కరెంటు వైర్లు, హెల్మెట్.
హెల్మెట్ పైభాగంలో సోలార్ ప్యానల్‌ను అమర్చుకోవాలి. ముందుభాగంలో కూలింగ్ ఫ్యాన్లు, హెడ్‌ల్యాంప్‌ను బిగించాలి. ఫ్యాన్లు, హెడ్‌ల్యాంప్‌లను కంట్రోల్ స్విచ్తోపాటు, డీసీమోటర్తో అనుసంధానించాలి. ఎండను గ్రహించి సోలార్ ప్యానళ్లు విద్యుత్తు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దాంతో స్విచ్ వేయగానే మోటర్‌కు బిగించిన ఫ్యాన్లు చల్లదనాన్నిస్తాయి. హెడ్‌ల్యాంప్ సైతం వెలుగుతుంది. ఈ విద్యత్తును రీచార్జబుల్ బ్యాటరీల్లో నిల్వచేసుకోవచ్చని విద్యార్థిని జయంతి పేర్కొన్నది.