Rakul Preet Singh | సోషల్ మీడియాలో తరచుగా సెలబ్రిటీలపై ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రోలింగ్లు, ప్రతికూల వ్యాఖ్యలపై నటీనటులు అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తునే ఉన్నారు. తాజాగా ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అనవసర విమర్శలపై రకుల్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. దురదృష్టవశాత్తూ, మన దేశంలో చాలా మందికి ఎలాంటి పనిలేదు. వారందరికీ ఉచిత డేటా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, ఇతరుల జీవితాల గురించి కామెంట్స్ చేయడం తప్ప వారికి ఇంకేమీ పనిలేకుండా పోయింది” అని అన్నారు. కాగా రకుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మరోవైపు రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న వేధింపులు, ట్రోలింగ్‌కు అద్దం పడుతున్నాయి. ఉచిత డేటా ప్లాన్ల లభ్యత, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు సులభంగా చేరువయ్యారని, అయితే దీనిని దుర్వినియోగం చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఆమె పరోక్షంగా అభిప్రాయపడ్డారు.