నారాయణపేట : నారాయణపేట జిల్లా కలెక్టర్ డి. హరిచందన ను సోషల్ ఇంపాక్ట్ అవార్డు వరించింది. ఈ మేరకు బ్రిటీష్ కౌన్సిల్ ప్రకటన చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ 2005-2006 సంవత్సరం విద్యార్థిని అయిన హరిచందన పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేకత చూపించినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్కు చెందిన 1500 విద్యార్థులలో నారాయణపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హరిచందన ఎంపిక కావడం విశేషం.