జన్నారం, ఆగస్టు 23 : మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని కవ్వాల్ టైగర్ జోన్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి రిలే దీక్ష చేపట్టారు.
ఆయన దీక్షకు వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టైగర్‌జోన్‌ను రద్దు చేసే వరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.