ఎక్కడికైనా వెళ్లినప్పుడు, మొబైల్ చార్జర్, డేటా కేబుల్స్, సిమ్ పిన్స్ అన్నీ ఒకే దగ్గర సర్దినట్టుగా కిట్లా అమర్చుకుని పెట్టుకోవాలంటే? విడి విడిగా కొనుక్కుని పెట్టుకోవడం సాధ్యం కాదు. దానికో స్మార్ట్ సొల్యూషన్ ఉంది. అదే Portronics Snapcase 2. ఇది కేవలం కేబుల్ కేస్ మాత్రమే కాదు.. ట్రావెలింగ్‌కి అవసరమైన ప్రతి ఫీచర్స్‌ని ఒకేచోట అందిస్తుంది. దీంతో మీ టెక్నాలజీ సమస్యలకు సింగిల్ సొల్యూషన్ దొరుకుతుంది. ఈ కేస్‌లో ఉండే టైప్-సి కేబుల్‌ని.. ఎక్స్టెన్షన్ బాక్స్‌లోని వైర్ మాదిరిగా అవసరం అయినప్పుడు బయటికి లాక్కుని.. మళ్లీ లోపలికి చుట్టేయవచ్చు. ఇందులో యూఎస్బీ-ఏ, మైక్రో, లైట్నింగ్ కనెక్టర్లు ఉంటాయి. 60వాట్స్ వరకూ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ కేస్‌ను అడ్జస్టబుల్ మొబైల్ స్టాండ్‌గానూ మార్చొచ్చు. నానో సిమ్, మైక్రో ఎస్డీ కార్డులు భద్రంగా పెట్టుకోవడానికి స్లాట్స్ ఉన్నాయి. సిమ్ కార్డులు మార్చేందుకు అవసరమైన పిన్ కూడా ఉంటుంది. ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారైన ఈ కేస్ కింద పడినా.. పగిలిపోదు. జేబులో, బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
ధర: రూ. 400
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

జెన్-జీ కోసం నాయిస్ సంస్థ Noise Twist స్మార్ట్‌వాచ్ తీసుకొచ్చింది. రౌండ్ డయల్, మెటాలిక్ ఫినిష్‌తో వస్తున్న ఈ వాచ్.. స్టయిల్లో ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్లో, ఎక్కువ ఫీచర్లతో సూపర్ డీల్‌గా సొంతం చేసుకోవచ్చు. Tru Sync టెక్నాలజీతో మొబైల్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. ఇది కేవలం వాచీలాగానే కాదు.. పర్సనల్ డాక్టర్లా పనిచేస్తుంది. 24×7 హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్ట్రెస్ లెవల్స్‌ని ట్రాక్ చేయొచ్చు. స్లీప్ ట్రాకింగ్, బ్రీథింగ్ ప్రాక్టీస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కాలింగ్ ఎనేబుల్ చేయకుండా వాడితే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 1.38 అంగుళాల రౌండ్ టీఎఫ్టీ డిస్ప్లే చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది. ఇందులో వందకు పైగానే వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఐపీ 68 రేటింగ్‌తో భద్రతకు భరోసా ఇస్తుంది.
ధర: రూ. 2,000
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

చిన్నవాటి కోసం 6ఏ ప్లగ్‌లు, పెద్ద ఉపకరణాల కోసం 16ఏ ప్లగ్‌లు ఉంటాయి. ఒక్కోసారి మన దగ్గర ఉన్న ప్లగ్‌ని మార్చి వాడాలంటే టెన్షన్ పడతాం. ముఖ్యంగా గీజర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి వాటికి సరైన అడాప్టర్ వాడకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వైర్లు కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పుల్‌స్టాప్ పెట్టడానికి Havells కంపెనీ అందిస్తున్న ఈ 6ఏ/16ఏ మల్టీపర్పస్ అడాప్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక భద్రత గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. చిన్న మొబైల్ చార్జర్ల నుంచి, పెద్ద గీజర్లు, ఏసీల వరకు దేనికైనా వాడుకోవచ్చు. మల్టీపర్పస్‌గా పనికొస్తుంది. ఫ్లేమ్ రిటార్డెంట్తో తయారు చేయడంతో.. ఎక్కువ కరెంట్ వల్ల వేడెక్కి, మంటలు వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది. భద్రతకు పక్కా గ్యారెంటీ. దీని పిన్లు నికెల్ ప్లేటెడ్ బ్రాస్‌తో తయారు చేశారు. దీంతో తుప్పు పట్టకుండా, ఎక్కువకాలం మన్నుతాయి.
ధర: రూ. 300
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

యూట్యూబ్ వీడియోలు చేస్తున్నా, ఇంటర్వ్యూలు రికార్డ్ చేస్తున్నా, ప్రొఫెషనల్ వ్లాగర్ అయినా… వీడియో క్వాలిటీతోపాటు వాయిస్ క్వాలిటీ కూడా టాప్ లెవెల్లో ఉండాలి. లేదంటే మీ కంటెంట్‌కి వైబ్ రాదు. అందుకే రెగ్యులర్‌గా వాడే వైర్ మైక్‌లను పక్కన పెట్టేసి.. Hollyland Lark M2 వైర్లెస్ మైక్రోఫోన్ ట్రై చేయొచ్చు. ఇది చూడటానికి చిన్నగా ఉన్నా, ఇచ్చే సౌండ్ క్వాలిటీ మాత్రం పక్కా స్టూడియో గ్రేడ్. బరువు కేవలం 9 గ్రాములే. మార్కెట్లో దొరికే వాటిలోకెల్లా లైటెస్ట్ మైక్ ఇదే. సౌండ్ రికార్డింగ్‌లోనూ టాప్ ఆఫ్ ది లైన్. చుట్టూ ఉన్న నాయిస్‌ని ఫిల్టర్ చేసి.. మీ వాయిస్‌ను క్రిస్టల్ క్లియర్‌గా అందిస్తుంది. ట్రాన్స్మిషన్ రేంజ్ దాదాపు 1000 అడుగుల వరకూ ఉంటుంది. బ్యాటరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే.. 10 గంటల వరకు కంటిన్యూగా పనిచేస్తుంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 30 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. దీంతో లాంగ్ షూటింగ్‌లకు బాగా ఉపయోగపడుతుంది.
ధర: రూ. 10,000
దొరుకు చోటు: అమెజాన్