SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
SKN | తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన కొందరు ఉత్తరాది హీరోయిన్లు, ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
SKN | తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన కొందరు ఉత్తరాది హీరోయిన్లు, ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పని విధానం, నటీనటుల ఎంపికపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే ఇప్పుడు నెటిజన్లు మాత్రం గతంలో ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆయనపైనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమను పురుషాధిక్య పరిశ్రమగా అభివర్ణించారు. వయసు పైబడిన హీరోల సరసన నటించాల్సి రావడం, సినిమా సెట్స్‌లో ప్యాడింగ్స్ ఉపయోగించమని సూచించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్థానిక నటీమణులకు అవకాశాలు ఇవ్వకుండా, తెల్లటి చర్మం ఉందనే కారణంతో ఉత్తరాది హీరోయిన్లను ఎంపిక చేస్తారంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.గతంలోనూ తాప్సీ పన్ను, పూజా హెగ్డే, జాన్వీ కపూర్ వంటి నటీమణులు దక్షిణాది సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో ఈ అంశంపై చర్చ మొదలైంది.
రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు సంపాదించుకున్న తర్వాత అదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నటుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే నిర్మాణాత్మక విమర్శకు, అవకాశాలు కల్పించిన పరిశ్రమను తక్కువ చేసి చూపడానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. తెలుగు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, కథా విలువలు ఉన్నాయని వివరించారు. ఒక ప్రాంతానికి చెందిన వారికి సహజంగా అనిపించే విషయాలు మరో ప్రాంతం వారికి భిన్నంగా కనిపించవచ్చని, అందుకే పరస్పర గౌరవం అవసరమని అభిప్రాయపడ్డారు.
నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ సాంస్కృతిక ఆధిపత్య ధోరణిని అంగీకరించలేమని స్పష్టం చేశారు. అవకాశాలు ఇచ్చిన పరిశ్రమను నటీనటులు కూడా గౌరవించాలని ఎస్కేఎన్ తన వ్యాఖ్యల ద్వారా సూచించారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్కేఎన్ చేసిన పోస్టుకు కొందరు తెలుగు సినీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను బయటకు తీసుకొస్తున్నారు. ఓ సినీ వేడుకలో ఎస్కేఎన్ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రోత్సహిస్తామని సరదాగా వ్యాఖ్యానించారు. తెలుగు అమ్మాయిలను సినిమాల్లో తీసుకుంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలపై తమకు అనుభవం ఉందని కూడా అన్నారు.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించినవేనంటూ వివాదం చెలరేగింది. అనంతరం ఎస్కేఎన్ వివరణ ఇస్తూ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య వంటి పలువురు తెలుగు నటీమణులను తానే పరిచయం చేశానని చెప్పారు. తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని స్పష్టం చేశారు. వైష్ణవి చైతన్య కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అప్పట్లో పేర్కొంది.అయితే ఇప్పుడు రాధికా ఆప్టే వివాదం నేపథ్యంలో ఆ పాత వీడియోలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు అమ్మాయిలకు అవకాశాల విషయంలో గతంలో అలా మాట్లాడిన మీరే, ఇప్పుడు ఇతర భాషల నటీమణుల వ్యాఖ్యలను తప్పుబట్టడం ఏమిటంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- radhika aptey
- SKN
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

