Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. కారు(Car accident) కరెంట్ పోల్‌ను ఢీకొట్టి మంటలు చెలరేగడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. కారు(Car accident) కరెంట్ పోల్‌ను ఢీకొట్టి మంటలు చెలరేగడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర సంఘటన ముజఫర్‌నగర్ జిల్లాలోని పానిపట్-ఖతిమా జాతీయ రహదారి జగహేరి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం అతివేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని, డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో భారీగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు కారులోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులంతా హర్యానాలోని జింద్ లేదా హిసార్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా కారులో హర్యానా నుండి హరిద్వార్‌కు ప్రయాణిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల ఒక బాలుడు కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

