‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Banjara Hills | నమస్తే తెలంగాణలో శనివారం ప్రచురించిన ఏసీబీ ఉచ్చులో ఎస్సై కథనం కమిషనరేట్‌లో సంచలనం సృష్టించింది. మొదలు ఆ ఎస్సై ఎవరంటూ పోలీసులంతా ఆరా తీయడం, తీరా ఎస్సై గురించి తెలుసుకుని అతను అలాంటివా డేనంటూ పోలీసువర్గాల్లో చర్చించుకోవడం కనిపించింది.
సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలం గాణ): ఆ ఎస్సై ముడుపుల వీడియో ఉందని ఏసీబీకి చేరినట్లుగా బయటకు చెప్పిందెవరు.. ఎస్సైని లీవ్ లో వెళ్లాలంటూ సూచించిన డివిజన్ అధికారికి వచ్చిన సమాచారమేంటి.. ప్రస్తుతం నగరం లోని కీలక పోలీసు స్టేషన్లలో ఒకటైన బంజా రాహిల్స్ విషయంలో జరుగుతున్న చర్చ ఇది. నమస్తే తెలంగాణలో శనివారం ప్రచురించిన ఏసీబీ ఉచ్చులో ఎస్సై కథనం కమిషనరేట్‌లో సంచలనం సృష్టించింది.
మొదలు ఆ ఎస్సై ఎవరంటూ పోలీసులంతా ఆరా తీయడం, తీరా ఎస్సై గురించి తెలుసుకుని అతను అలాంటివా డేనంటూ పోలీసువర్గాల్లో చర్చించుకోవడం కనిపించింది. శనివారం ఉదయం నుంచి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద నిఘా వర్గాల హడావిడి కొనసాగింది. లీవులో ఇద్దరు ఎస్సైలు వెళ్లగా వారిలో ఎవరు ఈ దందాకు పాల్పడిందనే కోణంలో ఎస్బీ అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా ఆ ఎస్సై వ్యవహారశైలి, ఆయన వెనక ఉన్న వారెవరు అనే కోణంలో ఎస్బీ, ఏసీబీ, టాస్క్ ఫోర్స్ బృందాలు వేర్వేరుగా సమా చారం సేకరించినట్లు తెలిసింది. నమ స్తేలో పేర్కొన్న రెండు కేసులలో ఎస్సైతో పాటు డివిజన్ అధికారి పాత్రపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమాచారం సేకరిం చారు. వారి మధ్య ఉన్న లింకును, జరి గిన లావాదేవీలపై కూడా నిఘావర్గాలు ఆరా తీసినట్లు సమాచారం.
అసలు ఈ మొత్తం వ్యవహారానికి కీల కమైన అద్దె పంచాయతీ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఈ పంచాయతీలో ఓ ఇంటి యజమానికి, అద్దె కున్న వారికి మధ్య ఉన్న వివాదంలో ఇరువర్గాలు పోలీసుశాఖ పెద్దలను తమకు మద్దతు పలికేలా తమకు ఉన్న పరిచయాలతో ఒప్పించి స్థానిక పోలీసు లపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఒకరి తరపున పోలీసు బాసు స్వయంగా రంగంలోకి దిగి ఫిర్యాదుదారులకు సరైన న్యాయం చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే బాసు ఆదేశాల మేరకు సదరు కేసులో అద్దెకున్నవారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిసింది. ఇదే వ్యవహారంలో సదరు అద్దెకున్న వారి తరపున నిఘావర్గాల డివి జన్ స్థాయి పోలీసు అధికారి కూడా రంగంలోకి దిగి రిమాండ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
పోలీసు బాసు ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తున్నా మని చెప్పిన డివిజన్ అధికారి అద్దెకున్న వారిలో ఒకరిని జైలుకు పంపి, మరొక ఇద్దరిపై కేసు పెట్టడంతో అసలు సమస్య మొదలైంది. తమను కొట్టిన ఎస్సైని వది లేది లేదని నిర్ణయానికి వచ్చిన అద్దెదా రుడు జైలునుంచి తన తండ్రి బయటకు వచ్చిన తర్వాత ఎస్సైని సంప్రదించడం మొదలుపెట్టాడు. తమపై కేసులు ఉన్నప్ప టికీ పోలీసుల ఒత్తిడి లేకుండా చూడా లని, తాము కోర్టులో అద్దె వ్యవహారం తేల్చుకుంటామని చెప్పడంతో ఎస్సై మొదట్లో ఒప్పుకోకుండా తర్వాత ఒప్పు కున్నట్లు తెలిసింది. సుమారు నెలరోజుల పాటు ఎస్సైతో సంప్రదింపులు జరిపి చివ రకు అతనితో డీల్ కుదుర్చుకుని రూ.2ల క్షలు ఇస్తూ తన ఉంగరంలో అమర్చిన సీక్రెట్ కెమెరా ద్వారా వీడియో తీసినట్లు గా పోలీసు నిఘా వర్గాల్లో చర్చ జరుగు తోంది. ఈ వీడియోతో ఏసీబీ అధికారు లను సంప్రదించిన బాధితుడు ఎస్సై బాగోతంపై చర్యలు తీసుకోవాలని కోరడం, ఏసీబీ సదరు ఎస్సైపై చర్యలకు ఉపక్రమిస్తున్న తరుణంలోనే ఈ వ్యవ హారం సదరు డివిజన్ అధికారికి తెలిసి ఎక్కడ ఈ వ్యవహారం తమకు చుట్టుకుం టుందోనని భావించి అతనిని లీవ్‌లో వెళ్లి పోవాలంటూ చెప్పడంతో అతను సెల వులో వెళ్లిపోయినట్లు పోలీసువర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
అసలు సదరు ఎస్సై ప్రవర్తన గురించి ఆరా తీస్తున్న నిఘావర్గాలు, ఏసీబీకి అత నికి డివిజన్ అధికారి అండదండలు ఉన్న ట్లుగా తెలిసింది. గత ఏడాది నుంచి ఇలాంటి చాలా వివాదాల్లో ఎస్సై తలదూ ర్చినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఉన్న ఇన్ స్పెక్టర్లు, ఇతర అధికారులు సైతం ఆ ఎస్సై వ్యవహారశైలిని వ్యతిరేకించినప్పటికీ ఏమీ మాట్లాడలేక అతనిని వదిలేసినట్లు తెలి సింది. ఈ వీడియో వ్యవహారం బయటకు రావడం వెనక ఎవరున్నారు.. తాము దర్యాప్తు జరుపుతున్న సందర్భంలో కొంద రితో మాట్లాడితే ఈ వీడియో ముచ్చట డివిజన్ అధికారి వరకు తెలియడం వెనక ఏసీబీ నుంచే ఎవరైనా లీక్ చేశారా.. లేక దర్యాప్తులో భాగంగా తాము మాట్లాడిన వారు చెప్పారా లేక వీడియో తీసినట్లుగా చెబుతున్న బాధితుడే ఈ విషయాన్ని లీకు చేశాడా అనే కోణంలో ఏసీబీ అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే డివిజన్ అధికారి కూడా ఈ కేసులో తమకు ఎలాంటి అవకాశం లేదని, మరో కేసులో మాత్రం ఎన్నారైల నుంచి రెండులక్షలు తీసుకున్నట్లుగా వచ్చిన ఫిర్యాదులతో తాము ఎంక్వైరీ చేశామని కానీ ఎక్కడా అలాంటి వ్యవహారానికి చోటే లేదని సన్ని హితులతో అంటున్నట్లు తెలిసింది. ఇదే విషయంలో స్థానిక అధికారులు సైతం తమకెందుకొచ్చిన గొడవ అంటూ ఈ విష యమంతా డివిజన్ అధికారికే తెలుసని, సెలవు మంజూరీ చేయాల్సింది కూడా ఆయనే కాబట్టి మొత్తం విషయం ఆయ నకే తెలుసంటూ చల్లగా జారుకుంటు న్నారు. ప్రస్తుతం ఏసీబీ సదరు ఎస్సైపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, బాధి తుడు ఇచ్చినట్లుగా చెబుతున్న వీడియోలో నిజానిజాల నిర్ధారణ జరిగిందా.. ఎస్సైపై పోలీసు బాసు ఏమంటున్నారనే అంశా లపై డివిజన్ మొత్తం పోలీసులు మాట్లాడుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

