సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షికారు’. హరి కొలగాని దర్శకుడు. పి.ఎస్.ఆర్.కుమార్ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ను గురువారం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యువతరం మెచ్చే కథాంశమిది. వారి మనోభావాల్ని ఆవిష్కరిస్తుంది. ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు.