చెన్నై: సీటీసీ-ఏఐటీఏ మహిళల టోర్నీలో తెలంగాణ షట్లర్ షేక్ అంజుమ్ రన్నరప్‌గా నిలిచింది. చెన్నై వేదికగా శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో షేక్ అంజుమ్- జనని జోడీ 3-6, 3-6తో సోనాషి భట్నాగర్ (కర్ణాటక), చందన పోతుగూరి (ఏపీ) జంట చేతిలో ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను గుజరాత్ అమ్మాయి సౌమ్య చేక్కించుకుంది. 6-0, 6-3తో కర్ణాటక షట్లర్ విధుల రెడ్డిని చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది.